ఎలమంచిలి ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ మెంబర్స్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మహిళలచే గానామృతం భజన కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాలను అందజేశారు