యలమంచిలి మండలం జంపపాలెంలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలంలో పని చేసుకుంటుండగా వివాహిత శిలపరశెట్టి రమణమ్మ (51) పాముకాటుకు గురైంది. వెంటనే ఈమెను యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.