AP: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్
అంబానీ కుమారుడు అనంత్
అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళాలు ప్రకటించారు. TTDకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు తెలిపారు. అలాగే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలను భరించడంతో పాటు, తిరుమలలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను
రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లోని వంతారా తరహాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు కూడా అంగీకరించారు. అనంత్
అంబానీ ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.