అనంతపురం పసికందు మృతి ఘటన.. ICDS పీడీ నాగమణి సస్పెండ్‌

34చూసినవారు
అనంతపురం పసికందు మృతి ఘటన.. ICDS పీడీ నాగమణి సస్పెండ్‌
AP: అనంతపురం శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనకు సంబంధించి, మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి నాగమణిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శిశు గృహంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు మరియు పర్యవేక్షణ లోపం కారణంగా ఆమెపై ఈ చర్య తీసుకున్నారు. ఈ నెల 2వ తేదీన 32 రోజుల చిన్నారి నిరూప్ మరణించాడు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్