
ధర్మవరం
చర్చిపై దాడిని ఖండించిన పాస్టర్లు, దోషులపై కఠిన చర్యలకు డిమాండ్
పోతుకుంట గ్రామంలో చర్చిపై జరిగిన దాడిని ఖండిస్తూ ధర్మవరం పట్టణంలోని ఎస్‌ఐయూ చర్చిలో జిల్లా వ్యాప్తంగా పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అభినయ్ జిల్లా పాస్టర్లు, మైనారిటీ అధ్యక్షులు శర్మ, పాస్టర్లు, నాయకులు శ్రీనివాసులు, సాకే వినయ్ తదితరులు పాల్గొన్నారు. చర్చిపై దాడిని మత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించిన వారు, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.





































