ఉరవకొండలో భారీ వర్షాలు: లోతట్టు ప్రాంతాలు జలమయం, రైతుల ఆందోళన

2485చూసినవారు
అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో మధ్యాహ్నం 3.50 గంటలకు భారీ వర్షం కురిసింది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైతులు వర్షం ఆగకుండా కురుస్తుండటంతో పంటలకు చీడపీడలు సోకుతాయని, మందులు పిచికారీ కూడా చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ ఉత్సవాల కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్