అనంతపురం జిల్లాలో మద్యం షాపుల నిర్వాహకులు ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారని, దీనిపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు మామూళ్లు అందుతున్నాయని, అందుకే పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.