గుఱ్ఱం జాషువా గారి 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

3చూసినవారు
గుఱ్ఱం జాషువా గారి 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
అనంతపురములో కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా గారి 130వ జయంతి వేడుకల్లో మంత్రి సత్య కుమార్ ఆదివారం పాల్గొన్నారు. జాషువా గారి సమాజానికి చేసిన కృషి, సాహిత్యానికి అందించిన ప్రేరణ, జాతీయవాద దృక్పథం గొప్పవని, ఆయన రచనలు సమానత్వం, న్యాయం కోసం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్, జిల్లా అధ్యక్షులు రాజేష్, రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర సెల్స్ కన్వీనర్ చిరంజీవి రెడ్డి, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్