అనంతపురంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా హాస్టల్ ను సోమవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో ఏర్పాటు చేసిన వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. నిరుపేద కమ్మ సామాజిక వర్గ మహిళల విద్యాభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టల్‌ను నిర్మించిన చల్లా రాజేంద్రప్రసాద్‌ను ఆయన అభినందించారు.