అనంతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), సిద్దిరాంపురం నుండి అభిలాష్, హేమ సాయి, సుస్మిత, అక్షయ అనే
విద్యార్థులు రాష్ట్ర స్థాయి జూనియర్స్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరు పాఠశాల కీర్తి ప్రతిష్టలను పెంచారని ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు ఆదివారం అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.