రెండు వారాల్లో టిడ్కో ఇళ్ల పనులు పునఃప్రారంభం కావాలి

4చూసినవారు
రెండు వారాల్లో టిడ్కో ఇళ్ల పనులు పునఃప్రారంభం కావాలి
అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టిడ్కో, హౌసింగ్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ విభాగాల అధికారులతో శనివారం సమావేశమయ్యారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, మార్చి చివరి నాటికి వీలైనన్ని ఇళ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని బ్లాక్స్ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులు తక్షణమే ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. సబ్ స్టేషన్లు, ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్