భారత రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత

2924చూసినవారు
భారత రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 01వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, బుక్కరాయసముద్రం మండలంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. ఈ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) నిర్వహించి, భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్