అనంతపురం జిల్లాకు చెందిన జీషాన్ ఖాన్ జాతీయ స్థాయి 10 మీటర్ల పిస్టల్ యూత్ విభాగంలో ఎంపికయ్యాడు. త్రివేండ్రంలోని వట్టియూర్కవు షూటింగ్ రేంజ్‌లో జరిగిన 16వ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో జీషాన్ యూత్, సబ్-యూత్ విభాగాల్లో అర్హత సాధించాడు. జాతీయ స్థాయి పోటీలకు అతని ఎంపికపై కోచ్ శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు.