
అనంతపురం శిల్పారామంలో సాంస్కృతిక వారాంతపు కార్యక్రమాలు
అనంతపురంలోని శిల్పారామంలో ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ రాజేశ్వరీ పదన్యాస నృత్యాలయం అకాడమీ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగాయి. శ్రేయ ఎకో వరల్డ్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ రాజేశ్వరి, అధా లక్ష్మి, సయతి, రుతిక, గానవి, హవిత, పనిత వంటి కళాకారులు గణపతి, స్వగతం కృష్ణ, బ్రహ్మాంజలి, అదిగో అలా అదిగో, అమ్మసాంబవి గరుడ గమన వంటి కార్యక్రమాలను ప్రదర్శించారు. పరిపాలనాధికారి శివప్రసాద్ రెడ్డి ఈ వివరాలను తెలిపారు.






































