
శిల్పారామంలో సంస్కృతి సాంప్రదాయాల సమాహారం
అనంతపురం శిల్పారామంలో ఆదివారం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నృత్య గురువు మానస, ఆమె బృందం క్లాసికల్, జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పరిపాలన అధికారి పి. శివప్రసాద్ రెడ్డి ఈ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోక్ష, శాన్వి, చంద్రిక, హేమ శ్రీ, యశస్వివిని, యుక్త శ్రీ, యోషిక, భాను శ్రీ, సుష్మిత, పల్లవి, అనూష, సన, నిహారిక వంటి కళాకారులు పాల్గొన్నారు. మహా గణపతిం, ఉరుముల రమ్మంటిని, ఓ పిల్లగా వెంకటేష్, సుక్కటీరు, నీలి నీలి కళ్ళ వాడే, వైరల్ వయ్యారి వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.





















