
గార్లదిన్నె: గర్భం దాల్చిన బాలిక
గార్లదిన్నె మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలిక గర్భం దాల్చినట్లు సమాచారం. సమీప బంధువు ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకున్నారని తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అనంతపురంలోని ఓ కళాశాలలో చదువుతున్న బాలికకు సంబంధించిన ఈ వార్త శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.







































