భగత్ సింగ్ జయంతి సందర్భంగా శనివారం పామిడిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాస్య శృంఖలాల విముక్తికై ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి, ఉరికంబంపై కూడా గర్జించి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడికి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పామిడి బిజెపి మండల అధ్యక్షులు చౌహాన్ అంజినాయక్, ప్రధాన కార్యదర్శి ఎం కుమార్, కార్యదర్శి దేవరాజ్, మాజీ అధ్యక్షులు మనోజ్ కుమార్, మాజీ సైనిక్ అధికారి లక్ష్మీనారాయణ, రాము, డాక్టర్ శివ కార్తీక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.