సివిల్ రైట్స్ డే కార్యక్రమం

2చూసినవారు
సివిల్ రైట్స్ డే  కార్యక్రమం
గుంతకల్ పట్టణంలోని 34వ సచివాలయం నందు రెవెన్యూ అధికారులు సివిల్ రైట్స్ డే (పౌరహక్కుల దినోత్సవం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా, పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాల వారు సోదరభావంతో మెలగాలని గుంతకల్ రెవిన్యూ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్ హరి ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్