కాకినాడ ఎమ్మెల్యేపై గుంతకల్‌లో ఫిర్యాదు

3311చూసినవారు
కాకినాడ ఎమ్మెల్యేపై గుంతకల్‌లో ఫిర్యాదు
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఖలీల్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గుంతకల్లు 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. పదవిలో ఉండి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్