గుత్తి రైల్వే గ్రౌండ్‌లో మూడు రోజులుగా ప్రేమ్ అండ్ సూరి జ్ఞాపకార్థం జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆత్మకూర్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ చేతుల మీదుగా విజేత జట్టుకు 50 వేల రూపాయల మొదటి బహుమతిని, 6వ వార్డ్ ఇంచార్జ్ రాజా అందజేశారు. రన్నరప్ జట్టు ఎర్రగుంట్ల జట్టుకు 25 వేల రూపాయల రెండో బహుమతిని ఎర్రగుడి రమేష్ అందజేశారు.