పామిడి పట్టణంలో వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అలంకరణతో భక్తులను ఆశీర్వదించారు. శనివారం నాడు విష్ణు సహస్ర నామ పారాయణం సమయంలో మనసులోని కోరికలు తీరుతాయని భక్తులు తెలిపారు. ఉదయం అభిషేక అర్చన, మధ్యాహ్నం కుంకుమ అర్చన, గోవింద నామాల ఉచ్చారణ వాసవి మాతృ మండలి వారు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారం అందించారు. భక్తులు అమ్మవారి అలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు, భక్తి గేయాలు ఆలపించారు.