శనివారం రాత్రి 10 గంటలకు పామిడి మండలం కాలపురం గ్రామంలోని చిన్న నెట్టికంటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, అర్చన, రాత్రి ప్రత్యేక అలంకరణ, భజనలు జరిగాయి. పూజారి ఆంజనేయులు భవిష్యవాణి వినిపించారు. వచ్చిన భక్తులకు అన్నదానం చేసి, మంగళ హారతితో తీర్థ ప్రసాదాలు అందించారు.