Oct 28, 2025, 06:10 IST/
ప్రియమణి సంచలన వ్యాఖ్యలు: నార్త్, సౌత్ షూటింగ్ సమయాల్లో తేడా ఇదే!
Oct 28, 2025, 06:10 IST
ప్రముఖ నటి ప్రియమణి నార్త్, సౌత్ సినీ పరిశ్రమల్లో పని గంటల విషయంలో ఉన్న వ్యత్యాసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ లో ఉదయం 8 గంటలకు షూటింగ్ అంటే ఆ సమయానికే ప్రారంభిస్తారని, కానీ నార్త్ లో నటీనటులు ఆ సమయానికి ఇంటి నుంచి బయలుదేరుతారని ఆమె తెలిపారు. పారితోషికం విషయంలోనూ తాను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, పాత్ర నిడివిని బట్టి డిమాండ్ చేస్తానని, అనవసరంగా రెమ్యూనరేషన్ పెంచమని ఎవరినీ బలవంత పెట్టలేదని ప్రియమణి స్పష్టం చేశారు. రావణ్ చిత్రంతో నార్త్ లో అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 లో కూడా నటిస్తున్నారు.