కుందుర్పిలో ప్రజాశక్తి విలేఖరి హనుమంతరాయుడిపై దాడికి ప్రయత్నించిన ఏపీవో మురళీధర్ పై చర్యలు తీసుకోవాలని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, ఆర్డీవో వసంతబాబుకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను కాలరాయడానికి ప్రయత్నించిన వారిని శిక్షించాలని కోరారు.