కళ్యాణదుర్గం: మహిళలు అన్య రంగాల్లో రాణించాలి

2136చూసినవారు
శ్రీ సరస్వతీ విద్యా మందిరం పాఠశాలలో శనివారం సప్త శక్తి సంఘం కార్యక్రమం జరిగింది. ఆర్. యస్. యస్. జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు కరణం తిరుమల రావు ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి, స్థానిక డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి జ్యోత్స్న మాట్లాడుతూ, కుటుంబం, సమాజం, దేశ శ్రేయస్సు కోసం మహిళలు తమలోని సప్త శక్తులను జాగృతం చేసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్