కళ్యాణదుర్గం పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్, మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి రోడ్లను శుభ్రం చేసి, చెత్తాచెదారాన్ని తొలగించారు. పచ్చదనం ఉంటే పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.