పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ

2093చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ
రాప్తాడు నియోజకవర్గం సీకేపల్లి మండలంలోని ఎన్ యస్ గేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ సందర్శించారు. ప్యాదిండి గ్రామ సచివాలయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించి, పోలియో బ్యాగులను, ఐస్ ప్యాక్ లను తనిఖీ చేశారు. అనంతరం గేట్ ఆసుపత్రిని సందర్శించి, మండలంలో పోలియో చుక్కల పంపిణీ శాతం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 98 శాతం వరకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్