ధర్మవరం పట్టణంలోని శ్రీనివాస నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 18వ తేదీ శనివారం నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు ప్రతి శనివారము ఏడుకొండల స్వామి వారి ఏడు శనివారాల వ్రతములు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, జింక రాజేంద్ర, అర్చకులు రాజేష్ ఆచార్యులు మంగళవారం తెలిపారు. గత పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని భక్తులు దేవాలయంలో ఈ వ్రతమును చేస్తున్నారని, ఈ వ్రతం చేయట వలన కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని వారు తెలిపారు. కావున ఆలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.