
రాయదుర్గం: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
ఒడిశా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ ప్రధాన్ (25) అనే మహిళ సోమవారం బొమ్మనహళ్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త దిబ్యాజ్యోతిరాయ్ జిందాల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. భర్త బంధువుల ఇంట్లో ఉండడం ఇష్టం లేక దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోని మెట్లకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ వివరించారు.







































