రాయదుర్గం మండలం రాతిబావివంక వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడితో సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మొలకల్మూరుకు చెందిన మహేశ్, ఒక బాలుడు ప్రయాణిస్తున్న బైక్, టి. వీరాపురంకు చెందిన మరో వ్యక్తి నడుపుతున్న బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.