రాయదుర్గం లో తప్పిపోయిన బాలికలు క్షేమం

5118చూసినవారు
రాయదుర్గం లో తప్పిపోయిన బాలికలు క్షేమం
రాయదుర్గం మండలం టి. వీరాపురంలో అదృశ్యమైన ఇద్దరు బాలికలను పోలీసులు సోమవారం తెల్లవారుజామున సురక్షితంగా గుర్తించారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు, రూరల్ సీఐ వెంకటరమణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు క్లూస్ టీమ్, జాగిలాల సహాయంతో గాలించి, దుగ్గిలమ్మ గుడి సమీపంలో బాలికలను స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు అప్పగించాయి. ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించి, బాలికల ఆచూకీని చాకచక్యంగా కనిపెట్టారు.

సంబంధిత పోస్ట్