ఆదివారం సాయంత్రం నుంచి రాయదుర్గం మండలం టి. వీరాపురానికి చెందిన మజిత, దీక్షిత అనే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు, రూరల్ సీఐ వెంకటరమణ గ్రామానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాలికల ఆచూకీ కోసం పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలికల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.