కణేకల్ మండలం కె.కొత్తపల్లి గ్రామంలో విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ, భగత్ సింగ్ జీవితం నేటి యువతరానికి, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. 1907 సెప్టెంబర్ 27న జన్మించిన భగత్ సింగ్, అతి చిన్న వయసులోనే దేశభక్తిని అణువణున నింపుకొని దేశ స్వాతంత్ర్యం కోసం, సమ సమాజ స్థాపన కోసం పోరాటం చేశాడని తెలిపారు.