శింగనమల మండలకేంద్రంలో గత ప్రభుత్వం ప్రారంభించిన అండర్ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. బిల్లులు అందలేదని కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని శనివారం మండల ప్రజలు తెలిపారు. దీంతో గ్రామంలో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఎస్సీకాలనీ నుంచి దర్గా వరకు కాలువలు తీసినా, మిగతా చోట్ల పనులు అసంపూర్తిగా ఉండటంతో మురుగునీరు కాలువల్లోకి వెళ్లకుండా పక్కకు ప్రవహిస్తోంది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు వాపోయారు.