అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఆలూరు కోన రంగనాథ స్వామి ఆలయంలో నూతన పాలకమండలి సభ్యులు శనివారం నాడు ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలూరు కోన రంగనాథ స్వామి ఆలయ చైర్మన్గా ఓగేటి రంగనాయకులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఓగేటి రంగనాయకులు అన్నారు.