తాడిపత్రి మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీవిపి కాలనీకి చెందిన దాసరి కళ్యాణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లనూరు రింగ్ రోడ్ సమీపంలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.