ఆసియా టెన్నిస్ బాల్
క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన షేక్ షాహిదాను ఉరవకొండలో ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసిఫ్ అమ్మ, చిట్టమ్మల ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాహిదా ఆసియా టోర్నమెంట్‌కు వెళ్లేందుకు తమ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించామని, ఆమె విజయం సాధించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో షాహిదా మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనాలని తెలిపారు.