మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల తనిఖీ

5014చూసినవారు
మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల తనిఖీ
గుంతకల్ రెవెన్యూ డివిజనల్ మెంబర్ ఎస్. హరి ప్రసాద్ యాదవ్, అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని మాళాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలను బుధవారం సందర్శించారు. విద్యార్థులు చదువుకునే నాలుగు గదుల్లోనూ చిన్నపాటి వర్షానికే నీళ్లు కారుతున్నాయని, గోడలు పెచ్చులు ఊడిపోతున్నాయని ఆయన గమనించారు. అంతేకాకుండా, విద్యార్థులకు తాగునీరు అందుబాటులో లేకపోవడంతో ఉప్పు నీరు తాగుతున్నారని గుర్తించారు. ఈ దుస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్