Nov 22, 2025, 04:11 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
టైర్లలో నీరు నిలువ ఉంటే ప్రమాదం
Nov 22, 2025, 04:11 IST
బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు నిల్వ నీటితో అనారోగ్యం వస్తుందని అవగాహన కల్పిస్తున్నారు. పాత టైర్లు, నీటి కుండీలు, గుంతల్లో ఉన్న నీటిని తొలగించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నివాస ప్రాంతాల్లో టైర్లు లేకుండా చూడాలని సూచిస్తున్నారు. నిల్వ నీటితో డెంగ్యూ దోమలు తయారవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఐవో వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ సతీష్ పాల్గొన్నారు.