Mar 15, 2026, 16:03 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
బిక్కనూరు హెచ్పీ గ్యాస్ దుకాణం వద్ద 'నో స్టాక్' బోర్డు
Mar 15, 2026, 16:03 IST
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ అంతా పంపిణీ చేయగా, కొత్త నిల్వలు రాకపోవడంతో 'నో స్టాక్' బోర్డును ఏర్పాటు చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలోనే కొత్త స్టాక్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొరతతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.