Feb 14, 2026, 04:02 IST/
నాడు సఫాయి కార్మికురాలు.. నేడు కౌన్సిలర్!
Feb 14, 2026, 04:02 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు సత్తా చాటారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన వెంకటమ్మ.. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలిగా పని చేశారు. ఫిబ్రవరి 13న వెలువడిన నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందారు. 10వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి రాణిపై 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆమె నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.