Apr 11, 2026, 03:04 IST/
రేపు ఇంటర్ ఫలితాలు విడుదల
Apr 11, 2026, 03:04 IST
TG: మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు. ఈ ఏడాది సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. కాగా సీఎం రేవంత్ చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.