అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై 98 అర్జీలను స్వీకరించారు. పిటిషనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించారు. పిటిషన్లకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.