తల్లి పాలు దానం చేస్తున్న ప్రతి మాతృమూర్తికి పాదాభివందనం

1చూసినవారు
తల్లి పాలు దానం చేస్తున్న ప్రతి మాతృమూర్తికి పాదాభివందనం
అనంత మదర్ మిల్క్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సీఎస్ఆర్ ఫండ్స్ దాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, తల్లి పాలు దానం చేస్తున్న ప్రతి మాతృమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అనంత మదర్ మిల్క్ బ్యాంక్ నెంబర్ వన్ గా నిలిచిందని, ఇప్పటివరకు 480 లీటర్ల పాలు సేకరించి 4వేల మంది పిల్లలకు అందించారని తెలిపారు. ఇలా దానం చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ మదర్ మిల్క్ బ్యాంక్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్