అనంతపురంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్శకుల వసతి కేంద్రం కుప్పకూలింది. వసతి కేంద్రం కింద నిలిపి ఉంచిన బైకులు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. భారీ వర్షం కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.