అనంతపురంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్శకుల వసతి కేంద్రం కుప్పకూలింది. వసతి కేంద్రం కింద పార్క్ చేసిన బైకులు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు, ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.