అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరికటివేముల గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై కానిస్టేబుల్ మారుతీప్రసాద్ అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో దాడి చేసి, ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి కానిస్టేబుల్ పారిపోయాడు. యల్లనూరులో విధులు నిర్వర్తిస్తున్న మారుతీప్రసాద్ గత 20 రోజులుగా విధులకు హాజరు కాకుండా అరికటివేమలలోనే ఉంటున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.