అనంత: పండుగ ముంగిట విషాదాంతం

9చూసినవారు
అనంత: పండుగ ముంగిట విషాదాంతం
పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన ఉదయ్ కిరణ్ (12) ఆటోలో ఆడుకుంటుండగా ఇంజిన్ స్టార్ట్ అవ్వడంతో, ఆటో బోల్తా పడి బాలుడు మృతి చెందాడు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి వద్ద BTP కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నీటిలో ఊపిరాడక కపటలింగనపల్లికి చెందిన నితిన్ (15) మరణించాడు. అనంతపురం పోలీస్ కంట్రోల్ రూములో ఎస్సైగా పనిచేస్తున్న మోహన్ ప్రసాద్ (61) గుండెపోటుతో మృతి చెందారు.

సంబంధిత పోస్ట్