అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యక్తిగత పనుల కోసం బుధవారం నుంచి ఈనెల 30 వరకు సెలవుపై వెళ్లనున్నారు. ఈ సమయంలో, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కలెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆనంద్ ఈ నెల 30వ తేదీ తర్వాత తిరిగి విధుల్లో చేరనున్నారు.