అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ప్రజా సమస్యల పరిష్కారంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 'ఏఐ ప్రజావాణి'ని ప్రారంభించింది. జిల్లా ఎస్పీ పి. జగదీష్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఏఐ ఆధారిత వాయిస్-టు-టెక్స్ట్ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా స్వరంతో నమోదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులు క్షణాల్లో లిఖిత రూపంలోకి మారి, వెంటనే అధికారుల పరిశీలనకు చేరుతాయి. ఇది ప్రజా సమస్యల పరిష్కారంలో వినూత్న మార్పు తీసుకురానుంది.